ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న వాణిజ్య పంటలలో మిరప పంట( Chilli Cultivation ) కూడా ఒకటి.ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో 6.7 లక్షల ఎకరాలలో మిరప సాగు అవుతోంది.మిరప పంటలో మొదటి నుంచి సస్యరక్షక పద్ధతులు పాటిస్తూ ఏవైనా చీడపీడలు లేదా తెగుళ్లు పంటను ఆశిస్తే తొలిదశలోనే అరికడితే అధిక దిగుబడి( High yield ) పొందవచ్చు.
అలా కాకుండా తొలిదశలో అరికట్టకపోతే ఇక తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.మిరప పంట దిగుబడి అనేది వాతావరణ పరిస్థితులపై అధికంగా ఆధారపడి ఉంటుంది.ఈ పంటకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.చీడపీడల విషయానికి వస్తే మిరప పంటకు రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు, తామర పురుగులు వల్ల అధిక నష్టం వాటిల్లుతుంది.
తొలి దశలోనే ఈ పురుగులను అరికడితే అధిక దిగుబడి పొందవచ్చు.
వేసవికాలంలో లోతు దుక్కిలు దున్నడం వల్ల భూమిలో ఉండే ఫంగస్, వైరస్ లకు సంబంధించిన అవశేషాలు సూర్యరశ్మి( Sunlight ) వలన చనిపోతాయి.ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలను పొలం నుండి పూర్తిగా శుభ్రం చేయడం వల్ల వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించే అవకాశం ఉండదు.
మిరప పంటను ఆశించే తామర పురుగులు అనేవి చాలా చిన్నవిగా, సున్నితంగా ఉండి ఊదారంగులో చీలిన రెక్కలతో ఉంటాయి.ఈ పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా చేరి ఆకు రసాన్ని పీల్చడం వల్ల ఆకు మెలి తిరిగి, అంచుల వెంబడి పైకి ముడుచుకుపోతుంది.ఈ పురుగులను అరికట్టాలంటే ఎసిటామిప్రిడ్( Acetamiprid ) 20శాతం ఎస్.పి 0.2గ్రా లేదా డైఫెన్ థైయూరాన్ 1.5గ్రా ను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.తొలి దశలో ఈ పురుగులను అరికడితే దిగుబడి తగ్గే అవకాశం ఉండదు.