ఖమ్మం – కోదాడ రహదారిపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు.బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఖమ్మం -కోదాడ రహదారిపై బైటాయించి ఆందోళన నిర్వహించారు.
జిల్లా సరిహద్దు గ్రామం అయిన పైనంపల్లి వంతెనపై రాస్తారోకో నిర్వహించిన నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ధరణి పోర్టల్ వ్యవస్థను రద్దు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు.