90s లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన రంభ( Rambha ) ప్రస్తుతం అయితే సినిమాలకు దూరంగా ఉంది.కానీ ఒకప్పుడు ఈమె సౌత్,నార్త్ లోని చాలా భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది.
ఈమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ,భోజ్ పురి, హిందీ వంటి ఎన్నో భాషల్లో నటించింది.ఇక అప్పట్లో దివ్యభారతి( Divya bharathi ) చనిపోయాక రంభ అచ్చం దివ్యభారతి పోలికలతో ఉండడంతో ఆమె చనిపోయినప్పుడు ఆగిపోయిన కొన్ని సినిమాల్లో రంభ నటించింది.
ఇక రంభ ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైంది.ఈ సినిమా హిట్ అవ్వడంతో రంభ కి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
![Telugu Deshamuduru, Divya Barati, Brother, Indra Kumar, Raghavendra Rao, Rambha, Telugu Deshamuduru, Divya Barati, Brother, Indra Kumar, Raghavendra Rao, Rambha,](https://telugustop.com/wp-content/uploads/2023/09/Rambha-tollywood-Raghavendra-rao-kollywood-Social-media-Three-Roses-Divya-bharathi-Yamadonga.jpg)
అలా ఈమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.కేవలం సినిమాల్లో హీరోయిన్స్ గానే కాకుండా సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో కూడా చేసింది.మరీ ముఖ్యంగా యమదొంగ( Yamadonga ), దేశముదురు, హలో బ్రదర్,బైరవద్వీపం,నాగ వంటి సినిమాల్లో స్పెషల్ డాన్స్ చేసింది.ఇక కొత్త హీరోయినస్ వస్తున్న కొద్ది అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి.
![Telugu Deshamuduru, Divya Barati, Brother, Indra Kumar, Raghavendra Rao, Rambha, Telugu Deshamuduru, Divya Barati, Brother, Indra Kumar, Raghavendra Rao, Rambha,](https://telugustop.com/wp-content/uploads/2023/09/Rambha-tollywood-kollywood-Social-media-Three-Roses-Divya-bharathi.jpg)
దాంతో 2003లో రంభ నే స్వయంగా నిర్మాతగా వ్యవహరించి త్రీ రోజెస్ ( Three Roses ) అనే సినిమాని తెరకెక్కించింది.ఇక ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రంభ అప్పటి వరకు సంపాదించుకున్న ఆస్తులన్నీ పోయాయి.దాంతో మళ్లీ డబ్బుల కోసం ఐటెం సాంగ్స్ లో చేయడం ప్రారంభించింది.అయితే అలాంటి రంభ 2010లో ఇంద్ర కుమార్( Indra kumar ) అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.
ఇక వీరికి ఇద్దరు కూతుర్లు అలాగే ఒక కొడుకు కూడా ఉన్నాడు.కానీ ఆ మధ్యకాలంలో తన భర్తకి విడాకులు ఇవ్వబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో ఎంతగా చక్కర్లు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దీనికి ప్రధాన కారణం వీరిద్దరి మధ్య వచ్చిన ఆర్థిక సమస్యలే అని, ఆర్థిక సమస్యల వల్లే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని, కానీ టాలీవుడ్ లోని ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు ( Raghavendra rao ) రంభకి తన భర్తకి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి మళ్లీ ఇద్దరినీ ఒక్కటి చేశారట.