నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri kalyan ram ) హీరోగా రూపొందుతున్న డెవిల్ సినిమా పై అంచనాలు పెరుగుతూ వస్తోంది.అయితే అంచనాల నేపథ్యం లో నిర్మాత ఈ సినిమా కి భారీ గా ఖర్చు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
నందమూరి వర్గాల నుండి అందుతున్న సమాచారం మరియు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా( Devil Movie ) కు భారీ గా ఖర్చు చేస్తున్నారు.ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఒక ఎత్తు అయితే ఇక నుండి ఖర్చు చేయబోతున్న మొత్తం మరో ఎత్తు.
ఎందుకంటే ఇకపై అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నారట.అంతే కాకుండా వాటి కోసం భారీ గా ఖర్చు చేసి అత్యంత సుందరంగా నిర్మిస్తున్నారట.ఖర్చు కి వెనకాడకుండా ఈ సినిమా ను నిర్మాత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది.కెరీర్ బెస్ట్ మూవీ గా నందమూరి కళ్యాణ్ రామ్ కి నిలుస్తుందని ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
చాలా కాలం తర్వాత బింబిసార సినిమా( Bimbisara ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ తర్వాత ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ కి మంచి విజయాన్ని కట్టబెట్టలేక పోయాయి.
కళ్యాణ్ రామ్ కి డెవిల్ కనుక సక్సెస్ ను తెచ్చి పెడితే అప్పుడు కెరీర్ లోనే ది బెస్ట్ అన్నట్లుగా ఈ సినిమా నిలవడం ఖాయం.అంతే కాకుండా అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా ఈ సినిమా నిలిస్తే నందమూరి కళ్యాణ్ రామ్ మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక వేళ సినిమా ఫలితం కనుక అటు ఇటు గా అయితే కచ్చితంగా భారీ డ్యామేజ్ ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.