ప్రస్తుతం మన టాలీవుడ్( Tollywood ) నుండి మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’( OG ) చిత్రం కచ్చితంగా ఉంటుంది.ప్రముఖ దర్శకుడు సుజిత్( Director Sujith ) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్ ని పవన్ కళ్యాణ్ లేకుండా ముంబై లో జరుపుకుంటుంది.నిన్నటితో ఈ షెడ్యూల్ పూర్తి అయ్యింది.
ఈ షెడ్యూల్ తో ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు మొత్తం షూట్ చేసినట్టే అట.ఇక తదుపరి షెడ్యూల్ మలేసియా లో జరగనుంది.ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పాల్గొనబోతున్నారు.సుమారుగా 30 నుండి 40 రోజుల వరకు సాగే ఈ షెడ్యూల్ తో ‘ఓజీ’ చిత్రం పూర్తి అయ్యినట్టే అని చెప్పొచ్చు.
![Telugu Dil Raju, Sujith, Pawan Kalyan, Tollywood-Movie Telugu Dil Raju, Sujith, Pawan Kalyan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/09/Literally-240-crores-OG-who-stole-RRR-record-before-releasea.jpg)
వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన చిన్న గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇది కదా పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గ సినిమా అంటే అని అభిమానులు ఎంతో సంతోషపడ్డారు ఈ గ్లిమ్స్ వీడియో ని చూసి.అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే చాలా ప్రాంతాలలో బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయిపోయాయి.
ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని 18 కోట్ల రూపాయలకు ఫార్స్ ఫిలిమ్స్ వారు కొనుగోలు చేసారు.రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇది హైయెస్ట్ అనే చెప్పాలి.
అలాగే నైజం ప్రాంతం లో ఈ చిత్రం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Produced Dil Raju ) 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
![Telugu Dil Raju, Sujith, Pawan Kalyan, Tollywood-Movie Telugu Dil Raju, Sujith, Pawan Kalyan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/09/Literally-240-crores-OG-who-stole-RRR-record-before-releaseb.jpg)
ఇక మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన బిజినెస్ చర్చలు నడుస్తున్నాయి.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్, సాటిలైట్ మరియు హిందీ సాటిలైట్ రైట్స్ ఇలా అన్నీ కలిపి దాదాపుగా 240 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.గతం లో #RRR చిత్రానికి ఈ రేంజ్ బిజినెస్ జరిగింది, ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ చిత్రానికే అంత రేంజ్ బిజినెస్ జరుగుతుంది.
ఇక పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కూడా ఈ సినిమాకి వంద కోట్ల రూపాయలకు పైగానే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.పాన్ ఇండియా మార్కెట్ లేకపోయినా కూడా కేవలం తెలుగు మార్కెట్ తో వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్న ఏకైక హీరో గా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడు.