టీడీపీ అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులపై విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.ఈ మేరకు వరుస పిటిషన్లు దాఖలు చేస్తే విధులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
ఆర్డర్స్ సమయానికి కొత్త పిటిషన్లు వేస్తున్నారని మండిపడ్డారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కోర్టు ప్రొసీజర్స్ కూడా పాటించడం లేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
ఈ నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేయాలనుకుంటే మధ్యాహ్నం 12 గంటల లోపు వేయాలని సూచించారు.అదేవిధంగా నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినాలనడం సరికాదని న్యాయమూర్తి వెల్లడించారని తెలుస్తోంది.
కాగా చంద్రబాబు తరపున ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి డాక్యుమెంట్ల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే సెక్షన్ 207 సీఆర్పీసీ కింద అనుమతి ఇవ్వాలని న్యాయవాది కోరారు.