సూర్యాపేట జిల్లా: ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల వస్తున్న వరద ఉదృతి మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి వెళ్ళే రహదారిపై ఉన్న గురప్ప వాగు ప్రతీ వర్షా కాలంలో ఉదృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించేది.ప్రవాహ ధాటికి అందులో కొట్టుకుపోయి మరణించిన వారు ఉన్నారు.
గురప్ప వాగుపై ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అయితే ప్రజల రాకపోకలు కోసం తాత్కలికంగా నిర్మించిన రోడ్డు వరద తాకిడికి కోతకు గురై కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది.
దీనితో మళ్ళీ తాడ్వాయి ప్రజలకు తిప్పలు మొదలయ్యాయి.నిత్యం ప్రజలు నడిచే మార్గం కావడంతో తాత్కాలిక రోడ్డు విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉండేనని గ్రామస్తులు అంటున్నారు.
అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డుకు మరమ్మత్తులు చెప్పట్టిప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.