తమన్నాను చిరంజీవి ఏమని పిలుస్తారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈయన మెహర్ రమేష్( Maher Ramesh) దర్శకత్వంలో నటించిన భోళా శంకర్ (Bhola Shankar)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

 Chiranjeevi Called Tamanna As Thaman, Chiranjeevi ,thamanna ,milk Beauty ,bhola-TeluguStop.com

ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మిల్క్ బ్యూటీ అనే పాటను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా( Thamanna ) నటించారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమన్నా మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు విషయాలను తెలిపారు.ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ తనని మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లొకేషన్లో కనుక ఉంటే తమన్( Thaman ) అంటూ పిలుస్తారని తెలిపారు.

తాను నన్ను ఎప్పుడు పిలిచిన అదేవిధంగానే పిలుస్తారని అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమన్ కావడంతో సెట్ మొత్తం తమన్ అనే పేరు మాత్రమే వినపడుతూ ఉండేదని తెలిపారు.

ఇక తనకు వచ్చిన బిరుదు మిల్క్ బ్యూటీ( Milk Beauty ) పేరు గురించి కూడా ఈమె పలు విషయాలు తెలిపారు.అసలు నాకు మిల్క్ బ్యూటీ అని బిరుదు ఎలా వచ్చిందో ఇప్పటికే అర్థం కాలేదని తెలిపారు.అయితే నా కలర్ చూసి ఆ బిరుదు ఇవ్వలేదని తెలుగు ప్రేక్షకులకు నాపై ఉన్నటువంటి ప్రేమ అభిమానంతోనే నాకు ఈ బిరుదు ఇచ్చారని తమన్నా తెలిపారు.

తాను ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్ని సంవత్సరాలకు తన బిరుదు పై ఓ పాట రావడం చాలా సంతోషంగా ఉందని తమన్నా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube