పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా రూపొందిన ‘బ్రో’ ( bro )సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్రో సినిమా టీజర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే.
తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ్య సీతమ్ ( Vinodiah Seetham )సినిమా తెలుగు లో పలు మార్పులు చేర్పులతో బ్రో గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రికార్డు స్థాయి లో సినిమా వసూళ్లు సాధిస్తుందని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.
హీరోగా సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ స్టామినాను బ్రో సినిమా ఓపెనింగ్స్ చూపించబోతున్నట్లుగా అంతా నమ్ముతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమం గా ఉంటాయి అనడంలో సందేహం లేదు.కనుక పవన్ కళ్యాణ్ బ్రో సినిమా యొక్క ఓపెనింగ్స్ వైపు అంతా చూస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ ( Janasena party )కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు.
అందుకే బ్రో సినిమా కి ఆంధ్రా వెళ్లి మరీ డబ్బింగ్ చెప్పించారు.ఇక పై అందరు నిర్మాతలు కూడా షూటింగ్స్ కు అయినా డబ్బింగ్స్ కు అయినా ఆంధ్రా వెళ్లాల్సిందేనా అంటూ చర్చ మొదలు అయ్యింది.
ఆ మధ్య సాధ్యం అయినంతగా ఎక్కువ సన్నివేశాలను ఏపీ లో నిర్వహించేలా ప్లాన్ చేయాలి అంటూ నిర్మాతలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ యొక్క బ్రో సినిమా ఏపీ లో మొదలు అయ్యింది.
అక్కడే ప్రీ రిలీజ్( Pre release ) ఈవెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే బ్రో సినిమా కు ఏపీ ప్రభుత్వం ఎంత వరకు సహకరిస్తుంది అనే విషయం లో స్పష్టత రావాల్సి ఉంది.
రాజకీయంగా ఎంతగా పవన్.జగన్ మధ్య విభేదాలు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం.
పవన్ కళ్యాణ్ ఇతర సినిమా లు కూడా మెల్ల మెల్లగా ఏపీ లో మేకింగ్ కు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.