పవన్ వ్యూహంతో వైసీపీకి ఊపిరి ఆడటం లేదా?

ఏ ఆటలోనైనా గెలవడానికి రెండు పద్ధతులు ఉంటాయి , ఒకటి తన బలాన్ని మెరుగుపరుచుకొని గెలవడం.రెండు ప్రత్యర్థి బలహీనతలను తెలుసుకొని తద్వారా విజయం సాధించడం రాజకీయాలు కూడా ఒక క్రీడగా మారిపోయి చాలా కాలమైంది.గెలవడానికి అన్ని రకాల శక్తి యుక్తులను రాజకీయ నాయకులు పన్నుతున్నారు.10 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఉన్నా ఇంకా అసెంబ్లీకి వెళ్లని పార్టీగా విమర్శలు ఎదుర్కుంటున్న జనసేన( Jana sena ) ఇప్పుడు తన బలాన్ని గుర్తించినట్లే ఉంది.పరిమితమైన ఆర్థిక వనరులతో రాష్ట్రం మొత్తం ఫోకస్ పెట్టడం కుదిరే పని కాదు.అందునా పార్టీ నిర్మాణం ఇంకా పూర్తిస్థాయిలో జరగని ఒక పార్టీ రాష్ట్రస్థాయిలో తన బలాన్ని కేంద్రీకరిస్తూ పోటీ చేయడం అన్నది ఆత్మహత్య సదృశ్యం అనే చెప్పాలి.

 how To Stop Pavan Is The Big Question For Ycp , Pawan Klayan, Jana Sena, Varahi-TeluguStop.com

అందుకే ఒంటరిగా వెళ్లి వీరం మరణం పొందను అని ముందే చెప్పిన పవన్ ఇప్పుడు తన బలాన్ని అంతా తన అనుకూల ప్రాంతంలో పెట్టి అధికార పార్టీ నాయకులకు ఊపిరి రాడనివ్వకుండా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి .

Telugu Ap, Chandra Babu, Jana Sena, Pawan Klayan, Varahi Yatra, Ys Jagan-Telugu

ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటిగా చెబుతూ తమ నాయకుల అవినీతిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )ని ఎదుర్కోవటం ఎలానో ఇప్పుడు అధికార పార్టీ నాయకులకు అర్థం కావడం లేదని తెలుస్తుంది.స్వయానా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికీ ఆయన పెళ్లిళ్లపై విమర్శలు చేస్తున్నారంటే పవన్ ని ఎదుర్కోవడానికి వారి వద్ద ఏ విధమైన ఆయుధం లేనందుకే అని చెప్పాలి పవన్ పెళ్లిళ్ల గురించి టాపిక్ ఇప్పటిది కాదు, జనం కూడా దాన్ని పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది.ఇప్పటికి కూడా అవుట్ డేటడ్ విమర్శలనే అధికార పార్టీ చేస్తూ ఉంది అంటే పవన్ వారికి అవకాశం ఇవ్వడం లేదనే చెప్పాలి.

Telugu Ap, Chandra Babu, Jana Sena, Pawan Klayan, Varahi Yatra, Ys Jagan-Telugu

అంతేకాకుండా ప్యాకేజ్ స్టార్ అని పదే పదే విమర్శలు చేసే అధికార పార్టీ తమ అధికారాన్ని ఉపయోగించిన పవన్ ఎక్కడ ఆర్థిక ప్రయోజనం పొందారో నిరూపించి ఉంటే ఆ ఆరోపణలకు కొంత చిత్తశుద్ధి వచ్చి ఉండేది.పవన్ పై అధికార పార్టీ చేసే ప్యాకేజీ ఆరోపణల పై తెలుగుదేశం పార్టీ( TDP ) కూడా వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటుంది.ఒక రకంగా పవన్ పై ఆ ముద్ర బలపడడానికి తెలుగుదేశం వ్యవహార శైలి కూడా ఒక కారణమని చెప్పాలి అయితే ఎన్ని విమర్శలు చేసినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో తాను క్రియాశీలక పాత్ర పోషించబోతున్నాను అని జనసేన బలంగా చాటుతుంది .ప్రస్తుతానికైతే జనసేన ను ఎదుర్కోవడానికి అధికార పార్టీ దగ్గర ఏ విధమైన ఆయుధం లేనట్లే ఉంది.మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube