మహారాష్ట్రలో పార్టీని విస్తరించేందుకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) భారీగానే ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్( BRS party ) భారీ బహిరంగ సభలు అనేకసార్లు నిర్వహించిన కేసీఆర్ చేరికలు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు మహారాష్ట్రలో టిఆర్ఎస్ కు మంచి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్న కేసీఆర్ దానికి అనుగుణంగానే ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా మహారాష్ట్రలో నేటి నుంచి రెండు రోజులపాటు పర్యటించేందుకు కేసిఆర్ సిద్ధమయ్యారు.ఈ మేరకు ఈ రోజు రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు బయలుదేరి వెళ్ళనున్నారు.
దీనికోసం 500 వాహనాలను సిద్ధం చేశారు.ఈ భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు వెళ్లి తమ సత్తా చాటుకోవాలనే ఉద్దేశంతో కేసిఆర్ ఉన్నారు.
తిరుగు ప్రయాణంలో మాత్రం ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
కేసీఆర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్( Balka Suman ) , మాజీ ఎంపీ వేణుగోపాల చారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో సమన్వయం చేసుకుంటున్నారు.మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోంద్గే, బీఆర్ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర శాఖ కన్వీనర్ మాణిక్ కదమ్ పర్యవేక్షిస్తున్నారు.సోలాపూర్ లో రాత్రి బస అనంతరం మంగళవారం ఉదయం స్థానికంగా అధిక సంఖ్యలో ఉండే తెలుగు ప్రజలతో పాటు , వివిధ రంగాలకు చెందిన కీలక వ్యక్తులతో కేసీఆర్ ప్రత్యేక సమావేశం అవుతారు.
ఆ తర్వాత పండరి పూర్ పట్టణానికి చేరుకుని శ్రీ విట్టల రుక్మిణి మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.తర్వాత స్థానికంగా జరిగే బీఆర్ఎస్ సభలో ఎన్సిపి దివంగత ఎమ్మెల్యే భరత్ బాల్ కె కుమారుడు భగీరథ బాల్కే కెసిఆర్ సమక్షంలో బీహార్ లో చేరుతారు.
మధ్యాహ్నానికి తుల్జాపూర్ చేరుకుని భవాని మాత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అనంతరం అక్కడి కి సమీపంలోని ఉస్మానాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.ఇక భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు కేసిఆర్ రోడ్డు మార్గంలో వెళ్లడం వెనుక చాలా వ్యూహమే కనిపిస్తోంది.తెలంగాణ, కర్ణాటక , మహారాష్ట్ర లలో రోడ్డు మార్గాన ప్రయాణించడం ద్వారా, దేశం దృష్టిని ఆకర్షించాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ పర్యటనను విజయవంతం చేసే విధంగా బీఆర్ఎస్ నేతలు అంతా రంగంలోకి దిగారు.65వ నంబరు జాతీయ రహదారి పొడవున భారీగా ఫ్లెక్సీలు , స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేసే విధంగా కేసిఆర్ ఈ తరహా వ్యూహాలు అమలు చేస్తున్నారు.మొత్తంగా 315 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లే విధంగా కెసిఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు.