తమిళ్ ( Kollywood ) హీరో శివకార్తికేయన్ ( Sivakarthikeya n) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం.ఈయన నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
డాన్, డాక్టర్, ప్రిన్స్ వంటి సినిమాలతో ఈయన తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు.తెలుగు డైరెక్టర్ అనుదీప్ కె వి తో ప్రిన్స్ సినిమా చేసి గత ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించింది.ఇక ఇదిలా ఉండగా తాజాగా శివకార్తికేయన్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ ఇప్పటికే ఆసక్తి రేపాయి.శివ కార్తికేయన్ హీరోగా డైరెక్టర్ ఆర్ రవి కుమార్ ( Ravi kumar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”అలయాన్”(Ayalaan).
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
అలాగే నిన్న రాత్రి మరో ఎగ్జైటింగ్ సర్ప్రైజ్ కూడా ఇచ్చారు మేకర్స్.ఈ సినిమా నుండి గ్లిమ్స్ ( Ayalaan Glimpse ) రిలీజ్ చేయగా అది ఆడియెన్స్ ను మరో రేంజ్ లో ఆకట్టు కుంటుంది.న్యాచురల్ విజువల్స్ తో అందరిని కట్టిపేసేలా ఆశ్చర్యకరంగా ఈ గ్లిమ్స్ ఉంది.
ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్ ఏలియన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర ఇలాంటి సినిమాలు రాలేదు అనే చెప్పాలి.
నిన్న రిలీజ్ అయిన గ్లిమ్స్ లో ఏలియన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మెట్లు రావడం, శివ కార్తికేయన్ పై సీన్స్, బ్యాక్ గ్రౌండ్ సెటప్ అంతా చూస్తుంటే సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.మరి విజువల్ పరంగా ఇండియన్ సినిమా నుండి ఒక మంచి సినిమా రాబోతుంది అని అర్ధం అవుతుంది.ఏలియన్ బ్యాక్ డ్రాప్ ఫుల్ ఫ్లెడ్జ్ ఎలా ఆసక్తిగా నడిపించారో చూడాలి.