టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు ఈ ఏడాది తమ సినిమాలను విడుదల చేయడం లేదు.యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలు మాత్రమే ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాలలో అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సినిమా ఏదనే ప్రశ్నకు సలార్ సినిమా( Salaar ) పేరు వినిపిస్తుంది.కొన్నేళ్ల క్రితమే ఈ సినిమా షూట్ మొదలుకాగా ప్రశాంత్ నీల్( Prasanth Neel ) దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ప్రశాంత్ నీల్ సినిమాలలో ఒకవైపు యాక్షన్ సన్నివేశాలకు మరోవైపు ఎమోషనల్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే.తాజాగా సలార్ సినిమాకు సంబంధించి షాకింగ్ ట్విస్ట్ అప్ డేట్ రివీల్ కాగా ఆ ట్విస్ట్ అప్ డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఊహలకు అస్సలు అందని విధంగా ఆ ట్విస్ట్ ఉండబోతుందని సమాచారం అందుతోంది.సలార్ మూవీ క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ రివీల్ కానుందని సమాచారం.
సలార్ మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ ( Prabhas ) పాత్రకు సంబంధించి ఒక షాకింగ్ విషయం రివీల్ అవుతుందని బోగట్టా.ప్రభాస్ మరో పాత్రకు సంబంధించిన ఈ ట్విస్ట్ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం.సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని ఇప్పటికే కన్ఫామ్ అయింది.త్వరలో అధికారికంగా కూడా ఈ మేరకు ప్రకటన రానుందని తెలుస్తోంది.
ప్రభాస్ ఈ సినిమాలో పవర్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను కొత్తగా చూపించనున్నారని ప్రభాస్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటుందని బోగట్టా.స్టార్ హీరో యశ్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ కు కూడా సలార్1, సలార్2 సినిమాలతో మరపురాని విజయాలను ఇస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.