నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వీర సింహారెడ్డి.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి వరుసగా పాటలను విడుదల చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సుగుణసుందరి, మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచాయి.ఇక మా బావ అనే పాటలో బాలకృష్ణతో కలిసి నటి చంద్రిక రవి సందడి చేశారు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి చంద్రిక రవి ఈ సినిమాలో నటించడం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.తాను ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగినప్పటికీ తన కుటుంబ మూలాలు దక్షిణాది భారత దేశంలో ఉన్నాయని తెలిపారు.
చిన్నప్పటి నుంచి తాను సౌత్ సినిమాలను చూస్తూ పెరిగానని ఈమె తెలియజేశారు.
![Telugu Balakrishna, Chandrika Ravi-Movie Telugu Balakrishna, Chandrika Ravi-Movie]( https://telugustop.com/wp-content/uploads/2022/12/my-life-Chandrika-Ravi-Chandrika-Ravi.jpg)
ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ తనకు చిన్నప్పటినుంచి భరతనాట్యం కూచిపూడి వంటి డాన్సులు నేర్పించారని ఈమె తెలియజేశారు.తన తల్లి మంచి డాన్సర్ కావడంతో తనకు డాన్స్ పై ఆసక్తి పెరిగిందని ఈమె తెలియజేశారు.ఇలా చిన్నప్పటినుంచి కూడా సినిమాలు చేస్తూ డాన్స్ పై మక్కువ ఉండటంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాను.
అయితే ఇలా ఇంత తక్కువ సమయంలోనే బాలకృష్ణ గారితో కలిసి డాన్స్ చేసే అవకాశం వస్తుందని తాను ఊహించలేదని తెలిపారు.చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను ఇక ఆయనతో డాన్స్ చేయడం చాలా గొప్పగా అనిపించిందని ఆ జ్ఞాపకాలను తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటానంటూ ఈ సందర్భంగా చంద్రిక రవి వీర సింహారెడ్డి సినిమా గురించి, బాలకృష్ణ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.