అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు ఆ స్థాయి కమర్షియల్ సక్సెస్ ని దక్కించుకోవడం లో విఫలమయ్యాడు.ఆ రెండు సినిమా లతో వచ్చిన క్రేజ్ నే ఇంకా కూడా కంటిన్యూ చూస్తున్నాడు.
ఆ రెండు సినిమాలు తప్పితే కొత్త సినిమాలతో సక్సెస్ కాలేక పోయాడు.పరిస్థితి ఇలాగే కొనసాగితే మరి కొన్నాళ్ళకు విజయ్ దేవరకొండ పరిస్థితి తల కిందుల అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఈ సమయం లో వెంటనే విజయ్ దేవరకొండ కి ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ పారితోషికం చాలా తగ్గింది అంటూ ప్రచారం జరుగుతోంది.
లైగర్ సినిమా ఆయన స్థాయిని మరింతగా తగ్గించింది అనేది కొందరి అభిప్రాయం.
అపజయం ఎరగకుండా వరుసగా సక్సెస్ లను దక్కించుకుంటున్న శివ నిర్వాణ దర్శకత్వం లో ఖుషి సినిమా ను విజయ్ దేవరకొండ చేసిన విషయం తెలిసిందే.సమంత హీరోయిన్ గా నటిస్తున్న సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.అన్ని సజావుగా సాగితే ఇప్పటి వరకు ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వాల్సి ఉంది.
కానీ సమంత అనారోగ్య కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడింది.వచ్చే సంవత్సరం లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే కెరియర్ పరంగా తంటాలు పడుతున్న విజయ్ దేవరకొండ కి సమంత అనారోగ్య పరిస్థితి పుండు మీద కారం అన్నట్లుగా ఉంది అంటూ సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.సమంత అనారోగ్యం ఎంత పని చేసింది అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు తల పట్టుకున్నారు.
ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ మరే సినిమా ను చేయడం లేదు.శివ నిర్వాన సినిమా పూర్తి అయితే తప్పితే కొత్త సినిమా ను విజయ్ దేవరకొండ కమిట్ అయ్యే పరిస్థితి లేదంటూ ఇండస్ట్రీ వర్గాల ప్రచారం జరుగుతుంది.