విజయనగరం జిల్లాలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది.మెంటాడ మండలం జయితి గ్రామ సమీపంలో పులి సంచరిస్తుంది.
ఈ నేపథ్యంలో పశువులపై దాడులకు పాల్పడుతోన్న విషయం తెలిసిందే.తాజాగా జిల్లాలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు చేస్తున్న ట్రక్ డ్రైవర్లకు పులి కనిపించింది.
దీంతో రహదారి పనులను నిలిపివేశారు.దాంతో పాటు సమీప గ్రామ ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.