హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎయిర్ లైవ్ పబ్ పై కేసు నమోదయింది.హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో పబ్ ఓనర్, మేనేజర్, డీజే సింగర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు.అనంతరం డీజే సాంగ్స్ కు సంబంధించిన సామాగ్రిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల రాత్రి 10 గంటల తర్వాత పబ్ లలో మ్యూజిక్ సిస్టం ఉపయోగించవద్దని హైకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.నిర్దేశించిన సౌండ్ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఎయిర్ లైవ్ పబ్ పై కేసు నమోదు చేశారు.