తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బీమా కోసం ఈ ఏడాదికి సంబంధించి ప్రీమియం చెల్లించింది.ఈ మేరకు రూ.26.11 కోట్లను బీమా సంస్థలకు చెందిన అధికారులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెల్లించారు.గత ఏడేళ్లుగా పార్టీ ప్రీమియం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అందిస్తున్న బీమా ప్రకారం ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా సొమ్ము అందిస్తుంది.ప్రమాదాల్లో పూర్తి స్థాయి అంగవైకల్యం కలిగితే రూ.లక్ష, పాక్షిక అంగ వైకల్యానికి రూ.50 వేలు అందించనుంది.ఇందుకు గానూ గడిచిన ఏడేళ్లలో పార్టీ తరపున సుమారు రూ.66 కోట్లను చెల్లించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.







