మల్లెమాలవారు నిర్వహిస్తున్న బుల్లితెర కార్యక్రమాలకు ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్ ఉంది.
ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమానికి దీటుగా మల్లెమాలవారు ప్రతి ఆదివారం మధ్యాహ్నం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో కూడా జబర్దస్త్ కమెడియన్స్ పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఆటపాటలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమాన్ని సుదీర్ యాంకర్ గా వ్యవహరించే సమయంలో అద్భుతమైన రేటింగ్స్ కైవసం చేసుకుంది.
ఇకపోతే సుధీర్ గత కొంతకాలం నుంచి మల్లెమాల వారి కార్యక్రమాలకు దూరమైన విషయం మనకు తెలిసిందే.
సుధీర్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో అంతే క్రేజ్ ఉన్నటువంటి యాంకర్ రష్మీని రంగంలోకి దింపారు.రష్మీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సమయంలో కూడా ఈ కార్యక్రమం భారీ రేటింగ్స్ సొంతం చేసుకుంది.
అయితే గత మూడు నాలుగు వారాల నుంచి ఈ కార్యక్రమం దారుణమైన రేటింగ్స్ ఎదుర్కొంటుందని తెలుస్తోంది.ఇలా ఉన్నఫలంగా రేటింగ్ తగ్గ పోవడానికి గల కారణం తెలియజేస్తూ మల్లెమాలవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని వారాల నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం రేటింగ్ పూర్తిగా తగ్గిపోవడానికి కారణం ఒకవైపు స్టార్ మా మరోవైపు జీ తెలుగులో మధ్యాహ్నం సమయంలో స్పెషల్ షోస్ వేయటం వల్లే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం రేటింగ్ దారుణంగా పడిపోయిందని తెలుస్తోంది.ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం పరిస్థితి ఎలా ఉంటుందోనని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక ఆ కార్యక్రమాలతో పాటు పోటీగా రేటింగ్ సంపాదించాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కూడా సరికొత్త కాన్సెప్ట్ ఎంచుకొని ప్రేక్షకులను సందడి చేయాల్సి ఉంటుంది.