అసలే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది.ఈ సీజన్‌లో ముఖం గ్లోయింగ్‌గా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.
కానీ, అందుకు భిన్నంగా ముఖం అలసటగా మరియు నీరసంగా కనిపిస్తే.ఇక వారి బాధ వర్ణణాతీతమే.
అయితే అలాంటి తరుణంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను ట్రై చేస్తే కేవలం ఇరవై నిమిషాల్లోనే గ్లోయింగ్ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడర్, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు దీన్ని నీళ్లు పోసిన పాన్‌లో సగం మునిగేలా ఉంచి గ్యాస్‌పై ఐదు నుంచి పది నిమిషాల పాటు హీట్ చేసి చల్లారబెట్టుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై మాస్క్‌ను తొలగించి వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకుంటే.చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోయి ముఖం గ్లోయింగ్‌గా, ఫ్రెష్‌గా మారుతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు పచ్చసొన, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం నార్మల్ వాటర్‌తో శుభ్రంగా ఫేస్‌ను క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసినా చర్మం కాంతివంతంగా, అందంగా మెరిసిపోతుంది.కాబట్టి, తప్పకుండా వీటిని ప్రయత్నించండి.