విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.అయితే గంటా పార్టీలో ఉండీ లేనట్లు వ్యవహరిస్తున్నారు.
పైగా పార్టీ మారతాడనే చర్చ జరుగుతుండటంతో గంటా వ్యూహం ఏంటనేది అవరికీ అర్థం కావడంలేదు.అయితే గంటా ఏ పార్టీలో ఉన్నా అధికారం మాత్రం ఆయన సొంతం అనే చెప్పాలి.
కానీ ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి అధికారం లేకపోవడంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అది కూడా జనసేన వైపు చూస్తున్నట్లు చర్చ నడుస్తున్నప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు.
కాపు సామాజికవర్గంపై మంచి పట్టున్న లీడర్ కావడం, జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలిచే సత్తా ఉందని భావించి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే విశాఖ నార్త్ నుంచి 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో గంటా వ్యూహం ఫలించలేదు.
ఎప్పుడైనా అధికార పార్టీలో ఉండి మంత్రి పదవి దక్కించుకునే గంటా ఈ సారి మాత్రం అనుకున్నది సాధించలేకపోయాడు.అందుకేనేమో గంటా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తన రాజకీయానికి అనుకూలంగా మలచుకుని ఎవరూ ఊహించని విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
రిజైన్ చేసి ఏడాదైనా ఆమోదించకపోయే సరికి ఆయన ఇటీవలే స్పీకర్ లేఖ కూడా రాశారు.గతంలో కూడా వైసీపీ వైపు చూసినా ఓ మంత్రి, రాజ్యసభ సభ్యుడు అడ్డుకోవడంతో అది ఫలించలేదు.

ఇక రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంపై మంచి పట్టున్న నేతగా గంటాకు పేరుంది.అయతే ఇటీవల కాపు నేతలతో తరచూ సమావేశమవుతున్నారు.అయితే ప్రస్తుతం టీడీపీలో అప్పుడప్పుడు హడావుడి చేసే గంటా చంద్రబాబు సీఎం కావలని మాత్రం బలంగా కోరుకుంటాడు.కానీ.పార్టీ కీలక సమావేశాలకు, సభలకు మాత్రం డుమ్మా కొడుతుంటాడనేది అందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుతం జనసేనలోకి వెళ్లడానికి అన్ని సిద్దం చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.
కాగా మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి ఓ వర్గం సోషల్ మీడియాలో గంటాకి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారు.జనసేనలో చేర్చుకోవద్దని గట్టిగానే చెబుతున్నారు.
దీనిపై జనసేన ఇప్పటి వరకు స్పందించలేదు.అయితే ఇది కాకపోయినా గంటా వ్యూహాలు ఎప్పుడు తప్పవని సరైన టైమ్ లో ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అవుతారనే చర్చ నడుస్తోంది.