కదులుతున్న ట్రైన్ నుంచి ఫోన్ దొంగలించిన దొంగ.. వీడియో చూస్తే అవాక్కవుతారంతే..!

ట్రైన్‌లో, బస్సుల్లో, ఇంకా ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.అలా కాకుండా విలువైన వస్తువులతో పాటు ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను బయటే ఎగ్జిబిషన్ పెట్టకుంటే చాలా ప్రమాదం.

 The Thief Who Stole The Phone From The Moving Train If You Watch The Video, You-TeluguStop.com

ఎందుకంటే వాటిని దొంగలు చాకచక్యంగా చోరీ చేసే ప్రమాదం ఉంది.ఈ రోజుల్లో దొంగలను తక్కువ అంచనా వేయకూడదు.

వారు స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇంకా సూపర్ మ్యాన్ లాగా సాహసాలు చేస్తూ మరీ ప్రజలను దోచేస్తున్నారు.దీనికి నిదర్శనంగా తాజాగా ఒక వీడియో నిలుస్తోంది.

ఈ వీడియోలో ఒక బీహార్ దొంగ స్పైడర్ మ్యాన్ లాగా బ్రిడ్జిపై వేలాడుతూ మొబైల్ ఫోన్ దొంగలించాడు.దీనికి సంబంధించిన వీడియోని ఒక జర్నలిస్టు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.ఇప్పుడు అది కాస్తా వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.“వామ్మో, ఇదేం మాస్ దొంగతనం రా అయ్యా” అని కామెంట్లు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు ఓ రైలు డోర్ వద్ద కూర్చొని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చేత మొబైల్ పట్టుకొని సాంగ్స్ వింటూ ఉండడం చూడవచ్చు.

ఇంతలోనే ఆ ట్రైన్ ఒక బ్రిడ్జి గుండా దూసుకెళ్లడం ప్రారంభించింది.అయితే ఈ క్రమంలోనే బ్రిడ్జికి వేలాడుతున్న ఒక దొంగ ఈ యువకుడి చేతిలోని మొబైల్‌ను లాగేశాడు.

దీంతో ఆ యువకుడు బిత్తర మొహం వేశాడు.తన మొబైల్‌ ఊహించని విధంగా దొంగతనానికి గురి కావడంతో అతడు కాసేపు నమ్మలేకపోయాడు.

మిగతా ప్యాసింజర్లు కూడా కొన్ని సెకన్ల పాటు షాక్ లోనే ఉండిపోయారు.

ఈ వీడియో చూసిన నెటిజనులు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

“వీడు మామూలు దొంగ కాదని” ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube