జీమెయిల్ చాలా ఎక్కువమంది వాడుతూ ఉంటారు. యాహూ లాంటి మెయిల్ సేవలు ఉండగా.
దాదాపు ఎక్కువమంది జీమెయిల్ వినియోగిస్తూ ఉంటారు.ఆఫీస్ పనులకి లేదా ఎక్కువ సైజు గల ఫైల్స్ పంపించుకోవడానికి జీమెయిల్ బాగా ఉపయోగపడుతుంది.
ఆఫీస్ కు సంబంధించిన మెయిల్స్, మన పర్సనల్ ఫొటోలు, వీడియోలను జీమెయిల్ లో పెట్టుకుంటూ ఉంటాం.దీంతో జీమెయిల్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
జీమెయిల్ అకౌంట్ హ్యాక్ కు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది.
దీంతో పాస్ వర్డ్ లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి.
జీమెయిల్ హ్యాక్ అయితే మన పర్సనల్ విషయాలన్నీ ఇతరులకు తెలిసిపోతాయి.అందువల్ల జీమెయిల్ వాడేవారు ఒకే అకౌంట్ ను కాకుండా ప్రత్యామ్నాయం కూడా రెండో అకౌంట్ ను కూడా వాడటం చాలా ఉత్తమం.
రెండో గూగుల్ అకౌంట్ ద్వారా ఉపయోగాలేంటి.ఎలా క్రియేట్ చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.అనంతరం గూగుల్ అనే కనిపించే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ బటన్ మీద క్లిక్ చేయాలి.అనంతరం సెక్యూరిటీ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
తర్వాత వేస్ వీ కెన్ వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత రికవరీ సెక్షన్ లో రెండో మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.ఎప్పుడైనా మీ జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయినా లేదా ఫోన్ నెంబర్ కు నెట్ వర్క్ లేకపోయినా రెండో అకౌంట్ ను ఉపయోగించి రికవరీ చేయవచ్చు.
పాస్ వర్డ్ లేకుండా మీ రెండో మెయిల్ ఐడీని ఎవరూ తొలగించలేరు కాబట్టి ఇది రికవరీకి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.ఆన్ లైన్ లో ఏదైనా సర్వీసును ఉపయోగించుకోవాలంటే మెయిల్ ఐడీ అవసరం ఉంటుంది.మెయిల్ ఐడీ ఎంటర్ చేయకుండా ఆన్ లైన్ లో లభించే కొన్ని సేవలను మనం ఉపయోగించుకోలేం.దీంతో మెయిల్ ఐడీ నేది ఆన్ లైన్ ఉపయోగించే ప్రతిఒక్కరికీ చాలా అవసరం.
అందుకే మెయిల్ ఐడీని భద్రంగా సెక్యూర్ గా ఉంచుకోవాలి.