న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.ఈ సినిమా తర్వాత నాని అంటే సుందరానికి సినిమా చేసాడు.
ఇది ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ముందు నుండే పాజిటివ్ బజ్ రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే నాని ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు.కానీ ఇప్పుడు మాత్రం ఊర మాస్ లుక్ లోకి వచ్చి మాస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.
గత ఏడాది దసరా పండుగ సందర్భంగా నాని కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు ‘దసరా‘ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.
గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో మరొక విభిన్న పాత్ర పోషించ నున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటి వరకు నాని ని చూడని కొత్త లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.
ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడి త్రిల్ చేయ బోతున్నాడు.ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.అంటే సుందరానికి సినిమా ప్రొమోషన్స్ కారణంగా ఈ సినిమా కొద్దీ రోజులు షూటింగ్ వాయిదా వేశారు.ఇది పక్కన పెడితే ఈ సినిమా నుండి ఒక టాక్ బయటకు వచ్చింది.
దీని ప్రకారం ఈ సినిమా వచ్చే దసరా కి రిలీజ్ చేస్తున్నట్టు టాక్ వచ్చింది.కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాను దసరా రేస్ లో కాకుండా డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ మేకర్స్ అనుకుంటున్నారట.
మరి దీనిపై ముందు ముందు మరింత క్లారిటీ రావాల్సి ఉంది.