సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వ ఆర్థిక,కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కండని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ఆర్థిక సరళీకృత విధానాల వలన ప్రజలు,కార్మికులు,రైతులు తీవ్రంగా నష్టపోతున్నా,బడా పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేవిధంగా ఉన్నాయని అన్నారు.కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈ నెల 28,29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ,ప్రభుత్వ వాటాలు తగ్గిస్తూ,ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఉంటే,కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు,కర్షకులు, వ్యవసాయ కార్మికులు ప్రజలు అందరూ ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.మోడీ లాంటి మతోన్మాద ప్రధానిని ఇంటికి పంపించే వరకు దేశ ప్రజలందరూ ఉద్యమించాలని కోరారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్,జిల్లా ఆఫీస్ బేరర్స్ షేక్ లతీఫ్, ఎం శ్యామ్ సుందర్,కౌన్సిల్ సభ్యులు నాగుల్ మీరా, రమేష్,ప్రభాకర్,కర్ల కాంతారావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.