యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఐ), చండిగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం.చండీగఢ్ నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి.
మార్చి 14 ఇందుకు ముహూర్తంగా నిర్ణయించారు.ఈ మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ … దుబాయ్, చండిగఢ్ నగరాల మధ్య సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతోంది.
వారానికి నాలుగు రోజులు (సోమ, బుధ, శుక్ర, ఆది) చొప్పున మార్చి 26 వరకు ఈ సర్వీసులు నడవనున్నాయి.ఎయిర్ బబుల్ ఒప్పందం కింద మార్చి 14 నుంచి మార్చి 26 వరకు విమాన సర్వీసులను నడుపుతామని చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో రాకేశ్ డెంబ్లా తెలిపారు.
ఆ తర్వాత మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.ప్రస్తుతం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మాత్రమే యూఏఈలోని షార్జాకు వారానికి రెండుసార్లు అంతర్జాతీయ విమానాన్ని నడుపుతోందని రాకేశ్ తెలిపారు.
ప్రస్తుతం చండీగఢ్ నుంచి బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, ముంబై, కులూ, శ్రీనగర్, పాట్నా, జైపూర్, ధర్మశాల, లేహ్, గోవా, పూణే, అహ్మదాబాద్, కోల్‌కతా సహా 56 గమ్యస్థానాలకు సర్వీసులు నడుస్తున్నాయి.అయితే వీటి సంఖ్యను 76కి పెంచాలని ప్రతిపాదనలు వున్నాయి.
తద్వారా దేశంలోని చాలా భాగం చండీగఢ్ నుంచి కవర్ అవుతుంది.అంతేకాకుండా ఇక్కడి నుంచి లండన్‌కు డైరెక్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించాలనే యోచనలో అధికారులు వున్నారు.
దీని వల్ల యూకేలోని పంజాబీ ప్రవాసులకు , స్థానిక పరిశ్రమకు భారీగా ప్రయోజనం కలిగిస్తుంది.
ఇకపోతే.
కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.కరోనా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
విమానాల్లో ఎయిర్ బబుల్ పద్ధతి కూడా 27 నుంచి రద్దు అవుతుందన్నారు.







