తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట్లో సైడ్ క్యారెక్టర్ లో నటిస్తూ హీరోగా అవకాశాలు అందుకుని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గత నాలుగు సినిమాల నుంచి శర్వానంద్ వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నారు.ఎలాగైనా తన తదుపరి చిత్రాల ద్వారా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు శర్వానంద్ నటించబోతున్న తదుపరి చిత్రాన్ని ఈసారి థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలోనే శర్వానంద్ రీతువర్మ జంటగా తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఒకే ఒక జీవితం అనే ద్విభాషా చిత్రాన్ని థియేటర్ లో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాటు చేశారు.ఇదివరకే శర్వానంద్ నటించిన మహా సముద్రం వంటి సినిమాలు డైరెక్ట్ గా థియేటర్లో విడుదల అయినప్పటికీ ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకోలేక పోయాయి.
![Telugu Akkineni Amala, Amazon Prime, Ritu Varma, Oke Oka Jivitam, Ott, Sharwanan Telugu Akkineni Amala, Amazon Prime, Ritu Varma, Oke Oka Jivitam, Ott, Sharwanan](https://telugustop.com/wp-content/uploads/2021/11/sharwanands-oke-oka-jeevitham-movie-in-ott-detailsa.jpg )
ఈ క్రమంలోనే తను నటించిన ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.ఇందులో అక్కినేని అమల కీలక పాత్రలో నటించారు.అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాన్ని త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.వరుస ఫ్లాప్ చిత్రాలను ఎదుర్కొంటున్న శర్వానంద్ ఈ చిత్రం ద్వారా ఆయన సరైన హిట్ అందుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.