పవన్ ఈ మధ్యనే వకీల్ సాబ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసినదే.ఈ సినిమాతో పవన్ మళ్ళీ తన సత్తా నిరూపించుకున్నాడు.
ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ చిత్ర టీమ్ పై ప్రశంసలు కురిసాయి.ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రముఖులు కూడా ఈ సినిమా బాగుందని మంచి సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చావని పవన్ ను అభినందించారు.
మొదటి సారి పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా చేసి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న తన డ్రీమ్ ను నెరవేర్చుకున్నాడు.అయితే ఈ సినిమా తర్వాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
అంతేకాదు పవన్ సైడ్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా తెచుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా హిట్ అవ్వడంతో మరొక సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు పవన్.
ప్రస్తుతం పవన్ చేతిలో మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
పవన్ ఈ సినిమాలు పూర్తి చేసే లోపు దిల్ రాజు మరొక కథతో రెడీ అవ్వబోతున్నారు.
ఇప్పటికే దిల్ రాజు పవన్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం దిల్ రాజు తన కామ్ పౌండ్ లో ఉన్న డైరెక్టర్లలో మంచి కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట.
అయితే పవన్ వకీల్ సాబ్ సినిమా తీసిన విధానం నచ్చి వేణు శ్రీరామ్ తో మరొక సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వేణు శ్రీరామ్ పవన్ కోసం ఒక కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.
ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా కథ రెడీ చేస్తున్నాడట.త్వరలోనే పవన్ కు కథ వినిపించనున్నాడట.
అంతేకాదు దిల్ రాజు మరొక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ తో కూడా కథ రెడీ చేపిస్తున్నాడని సమాచారం.ఈ స్క్రిప్ట్స్ పవన్ కు వినిపించి ఏదో ఒకటి ఓకే చేయించాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడట.