బాబు టార్గెట్ పాలి ‘ ట్రిక్స్ ‘ … పప్పులుడకవా.! గడిచిన కొన్ని రోజులుగా చంద్రబాబు చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ప్రతి విషయాన్నీ.
తనకు అనుకూలంగా మార్చుకుంటు న్నారు.సీఎం జగన్ తిరుమల పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి టీడీపీ నాయకులను ఉసికొలిపి.
పోరాడాలని పిలుపునిచ్చారు.అదే సమయంలో సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక, జడ్జి రామకృష్ణ వివాదాన్ని మరింత పెద్దది చేశారు.ఆయన సోదరుడిపై ఎవరో వ్యక్తి దాడి చేస్తే.
దానిని వైసీపీ ఖాతాలోకి వేయాలని చూశారు.అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో జరిగిన ఓ ఆత్మహత్యను మంత్రి మెడకు చుట్టి.
తర్వాత వైసీపీ వైపు తిప్పేందుకు ప్రయత్నించారు.
ఇక, తాజాగా మరోసారి చిత్తూరు జిల్లాలో దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ.
డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖసంధించారు.మరి ఇంతలా ఆయన ఎందుకు దృష్టి పెట్టారు? ఇప్పుడే చిత్తూరును టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది.రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి ఘటనలపైనా స్పందించని చంద్రబాబు కేవలం చిత్తూరులో ఏం జరిగినా కూడా వెంటనే మీడియా మీటింగులు జూమ్‌లోనే పెట్టేసి ఏకేస్తున్నారు? అంటే.ఆయన దృష్టి అంతా కూడా తిరుపతిపైనే ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఇక్కడ త్వరలోనే ఉప పోరు జరగనుంది.ఎంపీ దుర్గా ప్రసాద్ మరణంతో మరో రెండు మూడు మాసాల్లో ఇక్కడ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది.
ఇది రిజర్వ్‌డ్ నియోజకవర్గం కావడం, దళిత వర్గాలు ఎక్కువగా ఉండడంతో వారిని తనవైపునకు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ఇలా చేస్తున్నారని తాజాగా ఓ టీడీపీ అసమ్మతి నాయకుడు కొన్నాళ్ల కిందట వైసీపీకి జైకొట్టిన నేత ఒకరు విశ్లేషించడంతో అందరూ అవాక్కయ్యారు.సాధారణంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇలాంటి వాటిని వాడుకుంటున్నారని అందరూ అనుకుంటారు.
కానీ, చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తారని తెలియక.ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇక్కడ ఎన్ని వ్యూహాలు పన్నినా.చంద్రబాబుకు పప్పులు ఉడకవని అంటున్నారు వైసీపీ నాయకులు.
ఎన్నికల మాట తర్వాత.బాబు మాత్రం చిత్తూరుపై దృష్టి పెట్టడాన్ని.
ఇక్కడి ప్రజలు ఎలా అర్ధం చేసుకుంటారో ? చూడాలి.