మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోరు.దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి కథతో వచ్చి ప్రేక్షకులను మెప్పించిందో అందరికీ తెలిసిందే.
వార్ బేస్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.
ఇక వరుణ్ తేజ్ యాక్టింగ్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
ఈ సినిమాను క్రిష్ ప్రెజెంట్ చేసిన విధానం అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది.ఇలాంటి సినిమా కెరీర్లో ఒక్కసారే పడుతుందని వరుణ్ తేజ్ అన్నాడు.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే మరింత బాగుంటుందని వరుణ్ భావిస్తున్నాడట.అందుకే తనవద్దకు వస్తున్న రైటర్స్‌కు కంచె సీక్వెల్ కథను రెడీ చేయాలని కోరాడట.
వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ కథను ఎవరు అందిస్తారో చూడాలి.కాగా కంచె సినిమా రిలీజ్ అయ్యి ఐదేళ్లు కావస్తోంది.
ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.