గతనెల హైదరాబాద్ లోని షాద్ నగర్ లో చోటుచేసుకున్న దిశ ఘటనలో నిందితులు ఇటీవల ఎంకౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే వారు మృతి చెంది ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ వారి మృతదేహాలకు అంత్యక్రియలు జరపానీయకుండా కోర్టులు బ్రేక్ లు వేస్తూ వచ్చాయి.
అయితే రోజు రోజుకూ ఆ మృతదేహాలు డీకంపోజ్ అయిపోతుండడం తో వాటిని భద్రపరచడం గాంధీ ఆసుపత్రికి పెద్ద సమస్య గా మారింది.ఈ నేపథ్యంలో ఇవాళ దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ చీఫ్ జస్టిస్ ముందు హాజరై మృతదేహాల భద్రతపై కోర్టుకు సమాచారం ఇచ్చారు.ఇప్పటికే మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు.
అయితే వారి మృతదేహాలు కుళ్ళి పోతుండడం తో వాటిని మైనస్ 2 డిగ్రీల సెల్సీయస్ ఫ్రీజర్‌లో ఉంచాలని, మరో వారం పది రోజులు గనుక అలానే వదిలేస్తే అవి పూర్తిగా కుళ్లిపోయే పరిస్థితి వస్తుంది అని కోర్టు కు తెలిపారు.ఈ నేపథ్యంలో కోర్టు కూడా ఇతర ఆస్పత్రుల్లో మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉందా అని కోర్టు ప్రశ్నించగా దానికి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలియదు అని బదులిచ్చినట్లు తెలుస్తుంది.మరి ఈ విషయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ప్రస్తుతం దీని విచారణ కొనసాగుతుంది.