తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 క్లైమాక్స్‌కు చేరుకుంది.మరో నాలుగు వారాల్లో బిగ్‌బాస్ ఈ సీజన్ ముగియబోతుంది.
ప్రస్తుతం ఇంట్లో 9 మంది ఉండగా ఈ వారంలో మహేష్ విట్ట ఎలిమినేట్ అయ్యాడు.నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో మహేష్ విట్ట ఎలిమినేషన్ అయిన విషయాన్ని చూపించబోతున్నారు.
ఎలిమినేషన్‌లో మహేష్ విట్టా, రాహుల్, వరుణ్, పునర్నవిలు ఉండగా తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా మహేష్ విట్టాను ఎలిమినేట్ చేసినట్లుగా స్టార్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మహేష్ విట్టా ఇన్ని రోజులు కూడా తనదైన శైలిలో గేమ్స్ ఆడుతూ వచ్చాడు.
ఫిజికల్‌గా కంటే మెంటల్‌గా అతడు ఎక్కువగా గేమ్ ఆడినట్లుగా అనిపించింది.మొదట కొందరితో మాత్రమే బాగున్న మహేష్ విట్టా ఆ తర్వాత అందరితో కలిసి పోయాడు.
అయితే అక్కడి విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, ఒకరిపై ఒకరికి కోపం వచ్చేలా చేయడం వంటివి చేశాడు.దాంతో ఈ వారం అతడు ఎలిమినేట్ అయ్యి ఉంటాడు అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మెడాలియన్ సంపాదించుకున్న వితికకు నిన్న బిగ్‌బాస్ భారీ పార్టీ ఇచ్చాడు.నిన్నటి ఎపిసోడ్‌లో రాహుల్ సేవ్ అవ్వగా నేడు ముగ్గురు పునర్ణవి, వరుణ్ మరియు మహేష్‌లు ఉన్నారు.వారిలో మహేష్ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించబోతున్నాడు.వచ్చే వారం మరింత ఆసక్తిగా షో మారబోతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.వచ్చే వారంకు ఇంట్లో ఎనిమిదం మంది మాత్రమే ఉంటారు.వచ్చే వారం లేదా ఆ తర్వాత వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.