ఈ వ్యక్తి వల్ల మోసపోయిన ఎన్నారైలు ఎవరైనా ఉంటే

ఎన్నారైలు అంటే డబ్బులు దండిగా ఉంటాయి, దోచుకుంటే పెద్ద రిస్క్ ఉండదు అనుకున్నాడు ఓ యువకుడు.అనుకున్నదే తడువుగా తనకి ఉన్న తెలివితేటలకి పని చెప్పాడు.

అందుకు ఎరగా విద్యా సంస్థని ఏర్పాటు అంటూ నమ్మించాడు, అతడికి తోడుగా మరొక వ్యక్తి జత అవ్వడంతో పాటు ఎన్నారైలు స్థానికుల నుంచీ దాదాపు 1.65 కోట్లు సేకరించి పరార్ అయ్యారు.వివరాలలోకి వెళ్తే వరంగల్ జిల్లా హన్మకొండ కి చెందిన అజిత్ రెడ్డి అనే వ్యక్తి బీటెక్ చదవుకున్నాడు.

పేరు మార్చుకుని సంజయ్ కుమార్ గా చలామణి అవుతూ విశాఖకి మకాం మార్చాడు.ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కాలేజీలలో ఫిజిక్స్ లెక్చరర్ గా పని చేస్తూ తన పధకాన్ని అమలు చేయడం మొదలు పెట్టాడు.

అమెరికాలో చదివానని, రోబోటిక్స్ లో తనకి ఎంతో అనుభవం ఉందని నమ్మించాడు.స్థానికంగా ఓ కాలేజీ ని ఈ టెక్నాలజీ తో మొదలు పెట్టాలనే ఆలోచన ఉందని అందరూ సహకరిస్తే అమలు చేద్దమని అన్నాడు.

దాంతో ఎంతో మంది ఎన్నారై లు అతడి ఉచ్చులో పడ్డారు.స్థానికంగా ఉండే కొంతమంది సైతం అతడి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చారు.ఆ డబ్బు తీసుకుని పారిపోయిన అతడు హైదరాబాద్ కి మకాం మార్చాడు.

Advertisement

అయితే తానూ మోసపోయాను అని గ్రహించినఅప్పల శ్యామ్ వెంకట్ అనే ఎన్నారై పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వలవేసి అతడిని పట్టుకున్నారు.ఇతడి కారణంగా ఎన్నారైలు ఎవరైనా మోసపోతే తమని సంప్రదించమని ఫోన్ నెంబర్ ( 9440700856) అందుబాటులో ఉంచారు పోలీసులు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు