తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ షో( Bigg Boss Show ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్నప్పటికీ మరే భాషలో కూడా తెచ్చుకోలేనంత భారీ గుర్తింపును ఏర్పరచుకుంది.
ఇకపోతే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే.అయితే షో ప్రారంభం కాకముందే నాగార్జున ఉల్టా పుల్టా అంటూ ఆసక్తిని రేపగా ప్రస్తుతం హౌస్ లో పరిస్థితులు చూస్తుంటే నిజంగానే అన్నీ ఉల్టా పుల్టా అన్నట్టుగానే ఉన్నాయి.
ఇకపోతే ఇప్పటికే 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.వారిలో రతిక రోజ్, ప్రిన్స్ యావర్, షకీల, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని భట్ల మొత్తం 8మంది నామినేషన్స్ లో నిలిచారు.అయితే వీరిలో కిరణ్ రాథోడ్( Kiran Rathore ) ఎలిమినేట్ కాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.నిన్న శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున సందడి చేశారు.హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ చేశారు.అలాగే కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్, తప్పులు, ఒప్పుల గురించి ప్రస్తావించారు.
ఇక ఆదివారం ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగబోతోంది.
కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ తో పాటు మరో 8 మంది క్రేజీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టి రచ్చ చేయబోతున్నారట.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ లిస్ట్ లో సీరియల్ నటి పూజా మూర్తి, హీరోయిన్ ఫర్జానా, సీరియల్ హీరో పవన్ సాయి, యాంకర్ వర్షిణి, నటుడు అంబటి అర్జున్, యాక్టర్ క్రాంతి, నిఖిల్, ఐశ్వర్య ప్రిన్సే, బోలే షావలి నేడు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.