ప్రజాప్రస్థానంలో భాగంగా వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 50వ రోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పడమటి తండా వద్ద ప్రారంభించారు అక్కడి నుంచి ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం జన్ బాద్ తండా, సీతారాంపురం క్రాస్, రైల్వే కాలనీ మీదుగా సాగింది ప్రజాప్రస్థానం 50వ రోజుకు చేరిన సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు, అనంతరం ఉదయం పదకొండు గంటలకు పాపట్ పల్లి గ్రామంలో వడ్ల కొనుగోళ్లపై ధర్నా నిర్వహించి రైతులతో కలిసి నిరసన తెలిపారు, ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ.
మద్దతు ధర ఉన్న పంటను వేసుకోవద్దని , కొనము అని చెప్పే హక్కు ఏ పాలకులకూ లేదని, వడ్లు కొనలేనప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్లు? ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకున్నట్లు అని కేసీఆర్ ప్రభుత్వం పై వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై యస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు పరిపాలన చేయండని ప్రజలు అధికారమిస్తే వడ్లు కొనడం చేతగాని ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారని వై యస్ షర్మిల హెద్దేవ చేశారు.రాష్ట్రంలో రైతులు గత యాసంగిలో 52 లక్షల ఎకరాలు వరి వేస్తే, ఈ ఏడాది 35 లక్షలు మాత్రమే వేశారని, కేసీఆర్ వరి వేయొద్దన్నందున 17 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేయలేదనీ ఆ 17 లక్షల ఎకరాల్లో కొందరు ఇతర పంటలు వేసి నష్టపోయారన్నారు.ఇంకొందరు బీడు భూములుగా వదిలేశారు.
కేసీఆర్ వల్ల రైతులకు, రైతు కూలీలకు పనిదొరకకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
![Telugu Formmers, Khammam, Modi, Padayatra, Paddy, Trs, Ys Sharmila, Ysr Telengan Telugu Formmers, Khammam, Modi, Padayatra, Paddy, Trs, Ys Sharmila, Ysr Telengan](https://telugustop.com/wp-content/uploads/2022/04/ysr-telengana-trs-party-modi-bjp-formmers.jpg)
రాష్ట్రంలో పండించిన 35 లక్షల ఎకరాల వరిని కూడా కొనడానికి కేసీఆర్ కు చేతనైతలేదు.రైతు సమస్యలు పరిష్కరించడం రాదు కానీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై ధర్నాలు చేస్తారట అని మండిపడ్డారు.కేసీఆర్ యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రం దగ్గర ఒప్పుకొని, సంతకం పెట్టి ఈరోజు ఏమీ తెలియనట్టు రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్నారు.
కేసీఆర్ సంతకం పెట్టినందుకే కేంద్రం వడ్లు కొనబోమని చెబుతోంది.కేసీఆర్ ఎవరిని అడిగి సంతకం పెట్టారు? ఏ రైతుల్ని అడిగిపెట్టారు? కేసీఆర్ సంతకం రైతుల పాలిట మరణశాసనంగా మారిందన్నారు.రాష్ట్రంలో 35 లక్షల ఎకరాల్లో వరి పండించిన రైతులు ఆగమైపోయి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.కేసీఆర్ రైతులను గాలికొదిలేసి మిల్లర్లకు మేలు చేసే పనులు చేస్తున్నారు.కేసీఆర్ వడ్లు కొనమని చెప్పడంతో మిల్లర్లు కుమ్మక్కై రైతుల దగ్గర ప్రతి క్వింటాల్ పై రూ.500- 600 దోచుకునేందుకు ప్లాన్ వేశారు.రైతులు దోపిడీకి గురికావడానికి కారణం కేసీఆర్.కేసీఆర్ తప్పిదం వల్ల రైతులు ఎందుకు శిక్ష అనుభవించాలి? కేసీఆర్ ఒక్క సంతకంతో రైతులను బావిలో తోసి ఏమీ తెలియనట్టు రక్షించండి రక్షించండి అని కేంద్రాన్ని అడుక్కుంటున్నారు.అసలు సంతకం ఎవరు పెట్టుమన్నారు? ధర్నాల పేరుతో ఈ డ్రామాలు ఎవరు ఆడమంటున్నారు? కేసీఆర్ ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి నేను సంతకం పెట్టడం తప్పే అని తప్పు ఒప్పుకొని , కొనుగోలు కేంద్రాలు తెరిచి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు.
![Telugu Formmers, Khammam, Modi, Padayatra, Paddy, Trs, Ys Sharmila, Ysr Telengan Telugu Formmers, Khammam, Modi, Padayatra, Paddy, Trs, Ys Sharmila, Ysr Telengan](https://telugustop.com/wp-content/uploads/2022/04/kcr-paddy-ysr-telengana-trs-party-modi-bjp-formmers-khammam.jpg)
వైయస్ఆర్ గారు రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు.రైతులకు విత్తనాలు మీద, ఎరువుల మీద సబ్సిడీ ఉండేది.రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు.
రైతులు బోర్లు వేసుకుంటే సాయం చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేవారు.
ఈ దిక్కుమాలిన.దరిద్రపు కేసీఆర్ పాలనలో రైతులకు ఏ రకంగానైనా ఆసరా ఉందా? విత్తనాల మీద సబ్సిడీ లేదు.ఉచిత ఎరువులు హామీ నిలబెట్టుకోలేదు .ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి.విత్తనాలు నకిలీవో, అసలువో నియంత్రణ లేదు.పంట ఉత్పత్తి తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యంత్రలక్ష్మీ లేదు, ఇన్‌పుట్ సబ్సిడీ లేదు.రైతు బీమా లేదు.
రైతులు పంట నష్టపోతే కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన పరిపాలన కేసీఆర్ ది.పంట నష్టపోతున్న రైతులను ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఏనాడైనా పట్టించుకున్నారా? రైతులను గాలికొదిలేశారు.రైతులకు వెన్నుపోటు పొడిచారు.అందుకే రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో ఇలాగే ఉండెనా? ఆనాడు వ్యవసాయం పండుగలా లేదా? వైయస్ఆర్ గారు వడ్లకు 20 శాతం బోనస్ ఇచ్చి కొన్నారు .కేసీఆర్ కు బోనస్ ఇచ్చుడు ఎలాగూ రాదు కనీసం మద్దతు ధర అయినా ఇచ్చి కొనాలి కదా? మద్దతు ధర కూడా రైతులు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు.దొర బాంచెన్ అని రైతులు కేసీఆర్ కాళ్ల దగ్గర పడేయాలనేదే కేసఈర్ వ్యూహమని అన్నారు ప్రతి రైతుకు మద్దతు ధర ఇవ్వాలి.కేసీఆర్ రే మొత్తం వడ్లను కొనాలని డిమాండ్ చేసారు.
కొన్న వడ్లను బాయిల్డ్ రైస్ చేసుకుంటారా? రా రైస్ చేసుకుంటారా మీ ఇష్టం.బయట రాష్ట్రాల్లో అమ్ముకుంటారా? బయట దేశాల్లో అమ్ముకుంటారా అనేది మీ పనితనం మీద ఆధారపడి ఉంటుంది.వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.