మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ ఈ వయసులో కూడా అంతా యాక్టివ్ గా ఉంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.చిరంజీవి ప్రెసెంట్ కుర్ర హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.
ఈయన ఇది వరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసేవాడు.కానీ ఇప్పుడు అలా కాదు ఒకటి పూర్తి అవ్వకుండానే మరొకటి చేస్తూ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు.
ప్రెసెంట్ చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఇందులో రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించాడు.చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ గా చేయాలనీ మేకర్స్ నిర్ణయించారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరగనుంది అనేది లీక్ అయ్యింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 24న జరగనుందని సమాచారం.హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా ఈ ఈవెంట్ చేయాలనీ ప్లాన్ చేశారట.

ఇప్పటికే ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని తెలుస్తుంది.ఇక మెగాస్టార్ సినిమా కావడంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ప్రముఖులు హాజరవ్వ బోతున్నారట.ఈ వేడుకకు చిరు బ్రదర్ పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్, రాజమౌళి రాబోతున్నారని టాక్ ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తుంది.మరి ఈ ఈవెంట్ అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారో వేచి చూడల్సిందే.







