ఏపీలో వైసీపీ( YCP ) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) రెండో రోజుకు చేరుకుంది.ఇందులో భాగంగా ఇవాళ నంద్యాల జిల్లా( Nandyala District ) ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్రను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) ప్రారంభించారు.
ఆళ్లగడ్డ నుంచి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల గ్రామాల్లో పర్యటించనున్నారు.
ఈ క్రమంలో ఆయా గ్రామ ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహించనున్నారు.
నంద్యాల గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.సభ అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం మీదుగా పెంచికలపాడు వెళ్లనున్న సీఎం జగన్ అక్కడ పర్యటించనున్నారు.