అతిమధురం(ములేటి) పొడి.ఆయుర్వేద వైద్యంలో దీనిని విరి విరిగా ఉపయోగిస్తుంటారు.తియ్యటి రుచిని కలిగి ఉండే అతి మధురం పొడి.అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.అందుకే అతి మధురుం ఇంట్లో ఉండే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అంటుంటారు ఆయుర్వేద నిపుణులు.అసలు ఇంతకీ అతి మధురం పొడి ఎలా వాడాలి.? దీని వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలనే ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త హీనత సమస్యను నివారించడంలో అతి మధురం అద్భుతంగా సమాయపడుతుంది.అర స్పూన్ అతి మధురం పొడిలో పది ఎండు ద్రాక్షలు వేసి బాగా దంచి ముద్దలా చేసుకుని తినాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్త హీనత సమస్య పరార్ అవుతుంది.
అలాగే ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ అతి మధురం పొడి, నాలుగు తులసి ఆకులు, దంచిన చిన్న అల్లం ముక్క, అర స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి.ఆపై ఫిల్టర్ చేసుకుని తీసుకుంటే గనుక జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది.అదే సమయంలో శరీరంలోకి వ్యర్థాలన్నీ బయటకు పోయి లివర్ మరియు మూత్ర పిండాలు శుభ్ర పడతాయి.
జీర్ణ క్రియ చురుగ్గా మారి మలబద్ధకం తగ్గుతుంది.
అతి మధురం పొడిని యూజ్ చేసి బ్రెష్ చేసుకుంటే నోటి దుర్వాసన, నోటి పూత, దంతాల నొప్పి, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి.
ఇక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ అతి మధురం పొడి కలిపి తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢ పడతాయి.సంతాన సమస్యలు ఉంటే నయం అవుతాయి.మరియు చర్మ ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది.