సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ కు తెలంగాణలో అధ్యక్షుడు లేడు కానీ ఏపీకి ప్రకటించారన్నారు.
బీఆర్ఎస్ తో మళ్లీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరో చెప్పాలన్నారు.
నిన్న కేసీఆర్ జై తెలంగాణ అని కూడా అనలేదని తెలిపారు.కేసీఆర్ ప్రైవేటీకరణపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
విద్యుత్ ఛార్జీలు పెంచారన్న ఆయన రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటలు కరెంట్ వస్తుందా అని ప్రశ్నించారు.పోలవరంపై కేసీఆర్ స్టాండ్ ఏంటని అడిగారు.
గత ఎన్నికలకు ముందు తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి, ఆంధ్ర వాళ్లను తిట్టారని విమర్శించారు.కానీ ఇప్పుడు ఏపీ నేతల్ని పిలిపించుకుని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడని పేర్కొన్నారు.