విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లి చూపులు సినిమా మంచి సక్సెస్ సాధించడంతో విజయ్ దేవరకొండ హీరో గా మంచి గుర్తింపు పొందాడు.ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు.
ఇక ఈయన విషయం పక్కన పెడితే అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) తీసిన మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలతో కలిసి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు.
అయితే సందీప్ ఈ సినిమా చేయడానికి ముందు ఏం చేసేవారంటే ఆయన ఎంబిబిఎస్ చదివారు డాక్టర్ గా ప్రాక్టీస్ చేసుకోవాల్సింది కానీ ఆయనకి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీ కి రావాలి అనుకున్నాడు అందులో భాగంగానే ఆయన ఫిలిం స్కూల్ లో డైరెక్షన్ కి సంభందించిన శిక్షణ కూడా తీసుకున్నాడు…
ఇది అయిపోయిన తరువాత తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన కేడి అనే సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది.అలాగే క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు(Malli Malli Idi Rani Roju) అనే సినిమాకి రైటింగ్ సైడ్ కూడా చాలా వర్క్ చేశాడు సందీప్ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది…ఇక తను కూడ సినిమా చేయాలి అని అనుకొని తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ తో అందరూ హీరోలని కలిసే వారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పడం తో ఆయనకి ఏం చేయాలో అర్థం అయ్యేది కాదట మొత్తానికి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో అర్జున్ రెడ్డి అనే సినిమా తీయాలి అని అనుకొని తీశారు అయితే ఈ సినిమా కి ప్రొడ్యూసర్ కూడా సందీప్ వాళ్ల అన్నయ్యనే కావడం విశేషం…
.