పెద్దగా వయస్సు లేని అతగాడికి కొన్ని సంవత్సరాలుగా తన రెండు చెవులు వినబడటం లేదు.దాంతో అతగాడికి చెవుడు వచ్చింది నిర్దారణకు వచ్చేసారు.
అయితే ఈ విషయంలో డాక్టర్స్ ని సంప్రదించడంతో షాకింగ్ విషయం బయట పడింది.వివరాల్లోకి వెళితే, బ్రిటన్‌లోని డోర్సెట్‌కు చెందిన వాలెస్ లీ, రాయల్ నేవీలో పని చేసి రిటైర్ అయ్యారు.
అతనికి ఓ ఐదారేళ్లుగా చెవులకు సరిగ్గా వినపడటం లేదు.చాలా కాలం పాటు ఆయన విమానయాన పరిశ్రమలో పని చేయడం వలన అక్కడ విమానాల నుంచి వచ్చే పెద్దపెద్ద శబ్దాల వల్ల తన వినికిడి శక్తి తగ్గిపోయిందేమోనని అనుకున్నారు.
ఈ క్రమంలో వినికిడి శక్తి బాగా తగ్గిపోవడంతో వాలెస్ లీ ఆందోళనకు గురయ్యారు.ఈ విషయంలో ఆయన భార్య చాలా భయపడ్డారు.అయితే ఆయన తాజాగా ఎండోస్కోప్ ‘హోమ్ కిట్’ను కొన్నారు.దాని ద్వారా తన చెవుల్లో తెల్లని వస్తువు ఏదో ఉన్నట్లుగా గుర్తించారు.దాంతో వారు ఆసుపత్రికి వెళ్లారు.అక్కడ వైద్యులు చెవులును పరీక్షించి వాటిలో ఇయర్ బడ్స్ ఉన్నాయని తెలిపారు.దాంతో వారు ఖంగు తిన్నారు.ఈ క్రమంలో తన చెవుల్లోకి అవి ఎలా వెళ్లాయో వాలెస్ ఇలా వివరించారు.
దాదాపు అయిదేళ్ల కిందట వారి బంధువులను కలిసేందుకు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు ఇయర్ ప్లగ్స్ కొన్నాడట.
వాటి అటాచ్‌మెంట్స్ అతని చెవుల్లో ఉండిపోయాయట.క్లీన్ చేసేందుకు ప్రయత్నించినా అవి రాలేదట.ఆ తరువాత ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ ని కలిసినా ఫలితం లేకపోయింది.
దాంతో ఏళ్లుగా అవి చెవిలోనే ఉండిపోవడం వల్ల వాటి చుట్టూ గులిమి పేరుకు పోయిందట.దాంతో అతగాడికి వినికిడి ప్రాబ్లెమ్ వచ్చిందట.ఇక తాజాగా కలిసిన డాక్టర్లు నిపుణులు కావడంతో చెవిలోకి ఒక చిన్న ట్యూబ్ పంపి దాని సాయంతో వాటిని బయటకు తీశారట.దాంతో అతగాడికి మరలా వినికిడి శక్తి వచ్చింది.
దాంతో సదరు వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఇలాంటి సమస్యలు వచ్చినపుడు సొంత ప్రయోగాలు మాని, నిపుణులకు చూపిస్తే ఫలితం ఉంటుంది అని చెప్పుకొచ్చారు.