సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు.ఇతరులకు భిన్నంగా కామెంట్స్ చేస్తుంటారు.
ఈ క్రమంలో ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల తనదైన శైలిలో స్పందించారు ఆర్జీవీ.అందరూ ఆయన మరణం తీరని లోటని వ్యాఖ్యనిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంటే.
ఆర్జీవీ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు.కృష్ణ, విజయనిర్మల స్వర్గంలో ఆడుతూ, పాడుతూ సంతోషకరమైన సమయాన్ని గడుపుతుంటారని.
అందువల్ల బాధ పడాల్సిన అవసరం లేదని ఆర్జీవీ అన్నారు.అనంతరం కోరినది నెరవేరినది అనే పాటను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.







