ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది.కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.
సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జి ఆదేశించింది.సిట్ పై తమకు నమ్మకం లేదని, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం బీజేపీ పక్ష వాదనతో ఏకీభవించి కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.ఈ మేరకు ప్రభుత్వ అప్పీలుపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.