దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితులకు కస్టడీ నేటితో ముగియనుంది.నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డితో పాటు బినయ్ బాబులకు కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.
ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను ఈడీ కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది.అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ చేపట్టనుంది.
శరత్ చంద్రారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారని సమాచారం.