Ambati Rambabu : వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..!!

వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) ఇంటి వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులూ నిరసనలు తెలియజేయడం జరిగింది.ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ పోస్టులను వ్యతిరేకిస్తూ సత్తెనపల్లిలో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.

 Tension At Ycp Minister Ambati Rambabu House-TeluguStop.com

ఇది దగా డీఎస్సీ.మెగా డీఎస్సీ( Mega DSC ) కావాలంటూ.

నినాదాలు చేశారు.పాతికవేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.2019 ఎన్నికల ప్రచారంలో పాతికవేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.ఆ రకంగానే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శలు చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో బైబై జగన్, బైబై వైసీపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది.ఈ క్రమంలో తోపులాట జరగటంతో పాటు వాగ్వాదం చోటుచేసుకుంది.

వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఇప్పటికైనా సమయం మించిపోలేదు.

ప్రభుత్వం దిగిరావాలని… మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పేర్కొన్నారు.దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.అయితే రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని యూత్ కాంగ్రెస్( Youth Congress ) నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube