హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.యూత్ కాంగ్రెస్ నేతలు ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు.
పోలీస్ నియామక అర్హత పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ నేపథ్యంలో పరీక్షల్లో జరిగిన తప్పులను సరి చేయాలని యూత్ కాంగ్రస్ నేతలు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.