తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్.
సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మిస్టర్ మజ్ను ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.ఇకపోతే నిధి అగర్వాల్ కు అందం అభినయం అని ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.
టాలీవుడ్లో రామ్ పోతినేని, నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది.
కాగా నిధి అగర్వాల్ చివరగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది.
తర్వాత మళ్లీ ఆమెకు అవకాశాలు రాలేదు.ఇకపోతే సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువుగా ఉంటుంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ హీరోయిన్స్ సక్సెస్ ఫార్ములా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.కొన్ని సినిమాల స్టోరీస్ పేపర్ పై అద్భుతంగా ఉంటాయి కానీ స్క్రీన్ పై తేలిపోతుంటాయి.మరికొన్ని పేపర్ పై నార్మల్ గా ఉన్న స్టోరీస్ సిల్వర్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అని తెలిపింది నిధి అగర్వాల్.
కాబట్టి 90 శాతం సక్సెస్ కి లక్ కారణం.స్టోరీస్ ఆధారంగా సినిమాలు ఎంచుకునే రేంజ్ కు నేను ఇంకా రాలేదు.కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ చేయాలని ఉంది.అలాగే తెలుగు తమిళం హిందీ భాషల్లో యాక్టింగ్ పరంగా ఎటువంటి తేడాలు ఉండవు.
బిజినెస్ లో మాత్రం మార్పులు ఉంటాయి అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.నిధి అగర్వాల్ మాత్రమే బట్టి చూస్తే సినిమాలు లక్కుంటేనే సక్సెస్ అవుతాయి అని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.







