ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) ప్రారంభం అయింది.నాగార్జున అన్నట్లుగానే ఉల్టా ఫల్టా మరియు కుడి ఎడమైతే అన్నట్లుగానే షో సాగుతోంది.
కంటెస్టెంట్స్ పలువురు ఇప్పటికే హౌస్ లో అడుగు పెట్టారు.అయితే వారు కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే అని, ఇంకా వారు హౌస్ మెంట్స్ కాలేదు అన్నట్లుగా నాగార్జున( Nagarjuna ) ట్విస్ట్ ఇచ్చాడు.
ఆ విషయం పక్కన పెడితే ఈసారి షో లో అడుగు పెట్టిన వారిలో ఏ ఒక్కరు కూడా పెద్దగా ఆసక్తిగా లేరు అంటూ విమర్శలు వస్తున్నాయి.షకీలా మరియు శివాజీ( Shivaji ) లు కాస్త సీనియర్ లు.
మిగిలిన వారు అంతా కూడా బుల్లి తెర మరియు యూట్యూబ్ ( Youtube )ద్వారా సందడి చేసిన వారే.షకీలా మరియు శివాజీ లకే ఎక్కువ పారితోషికం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇద్దరి లో ఎవరికి ఎక్కువ పారితోషికం అంటే మాత్రం కచ్చితంగా షకీలా కు అంటూ షో నిర్వాహకులకు సన్నిహితులు అయిన వారు చెబుతున్నారు.ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ అందుకున్న పారితోషికం తో పోల్చితే షకీలాకు ఇస్తున్న పారితోషికం చాలా ఎక్కువ అన్నట్లుగా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ముఖ్యంగా బుల్లి తెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో శివాజీ కంటే కూడా పారితోషికం విషయం లో షకీలా( Shakeela ) ముందు ఉన్నారు.
ఆమె కనీసం 8 నుండి పది వారాలు కొనసాగితే విజేతకు వచ్చేంత పారితోషికం వస్తుందని అంటున్నారు.అంటే ఆమె పారితోషికం ఎంతో ఊహించుకోవచ్చు.కంటెస్టెంట్స్ లో చాలా మందికి గుండు గుత్త ఒప్పందం చేసుకోగా కొందరికి మాత్రం వారానికి ఇంత అన్నట్లుగా పారితోషికం ఇస్తున్నారు.
షకీలా మరియు శివాజీలకు వారం వారం పారితోషికం అందుతోంది.వీరిద్దరు కూడా ఇండస్ట్రీ లో మళ్లీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.కనుక పారితోషికం విషయం పక్కన పెట్టి షో లో బెస్ట్ గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.