హైదరాబాద్ లోని బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్ లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారు.సీనియర్ నేత జగ్గారెడ్డి, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహా, మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ తో పాటు శ్రీధర్ బాబులు ఈ తరగతులకు గైర్హాజరైయ్యారు.
అటు ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉండగా, కర్ణాటక పార్టీ వ్యవహారాల్లో శ్రీధర్ బాబు నిమగ్నమై ఉన్నారు.ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ, ఏఐసీసీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
మరోవైపు టీపీసీసీ శిక్షణా తరగతులను పార్టీ జెండా ఆవిష్కరించి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ తరగతులలో ధరణి, హత్ సే హత్ జోడోతో పాటు ఎన్నికల నిబంధనలపై నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు.