తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ) వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఈ కేసులో చాలామంది అధికారుల పేర్లు బయటికి వస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని విపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు( Chandrababu ) నిర్వహించిన టీడీపీ వర్క్ షాప్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బోండా ఉమ( Bonda Uma ) సంచలన ఆరోపణలు చేశారు.అంతేకాదు చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు.
ఏపీ ఇంటిలిజెన్స్ డైరెక్టర్ సీతారామాంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు.మరోపక్క విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని( Kesineni Chinni ) కూడా ఈ ఆరోపణలు చేస్తున్నారు.
ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియాలో తెలియజేస్తూ సంచలన పోస్ట్ పెట్టారు.“ఈ రోజు టీడీపీ ( TDP ) నిర్వహించిన వర్క్ షాప్ లో, చొరబడ్డ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరావు. ఐజీ సూచనలతో, వచ్చానని చెప్పిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్.అనుమానం వచ్చి టిడిపి నేతలు ఫోన్ చెక్ చేయగా, నివ్వెర పోయే వాస్తవాలు.ఫోన్ లోని ఒక యాప్ లో కేశినేని చిన్ని కదలికలు, మాటలను పరిశీలిస్తున్న ఆనవాళ్ళు.ఫోన్ ట్యాపింగ్‌కు ముందు ఇలాగే చేస్తారని చెప్తున్న పోలీసులు.
ఫోన్లు ట్యాప్ చేసిన ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్‌లో దొరికాయి.గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ పై, జగన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు, నేటితో నిర్ధారణ” అని ట్వీట్ చేయడం జరిగింది.